కరువు కరువు....ఎటు చుసిన కరువే...ఎం చేసిన కరువే...
స్వచ్చమైన నీటికి కరువే...గాలికి కరువే...
పేదవాడికి పట్టేడన్నానికి కరువే..
మధ్య తరగతి మందహాసానికి కరువే...
సంపన్నుడికి మనస్సాంతికి కరువే...
రుతుపవనాలలోను మేఘాలకు కరువే...నాట్లు వెయ్యాల్సిన రైతన్నకు నీళ్ళకు కరువే...
ఆడవారి భద్రతకు కరువే....నిజాయితీ గల నాయకులకు కరువే...
కాలుష్య రహిత వాతావరణానికి కరువే...సాఫ్ట్ వేర్ కొలువుల భద్రతకు కరువే...
పోషక విలువల పాలకు కరువే...పుట్టిన బిడ్డకు తల్లి ప్రేమ కరువే...
రసాయన రహిత పండ్లకు కరువే...నమ్మకమైన మనుషులకు కరువే...
కండి పప్పుకు కరువే....కూరగాయలకు కరువే...
స్వయన్ ఫ్లూ మందులకు కరువే...ఆసుపత్రులలో వార్డులకు కరువే...
చివరకు మనిషి భద్రతకు కరువే...దేశ భవిష్యత్తుకు కరువే...
కనీసం దేవుడికి నైవేద్యం పెట్టడానికి నెయ్యికి కరువే...
కరువు కోరల్లో మన అందరి బ్రతుకులు బరువే...
(దేశంలో ఎటు చుసిన వర్షాభావ పరిస్థితులతో, ధరలు ఆకాశానికి ఎగిరి, విద్య వుద్యోగ మరియు ఆహార భద్రత లేక విల విల లాడి అందరి బ్రతుకులు బరువై పోతున్నాయి...మళ్ళి మంచి రోజులు రావాలని....ప్రజలందరూ నిత్య సంతోషం తో వర్డ్చిల్లాలని కోరుకొంటూ....మీ అందరి ప్రతిబింబం)
Subscribe to:
Post Comments (Atom)
నిజం చెప్పే గుండెకీ కరువే...
ReplyDeleteఆత్మస్థైర్యం తో ముందుకెళ్ళే మనసూ కరువే...
ధైర్యం తో మాటకి కట్టుబడే మనిషి కరువే...
ఇన్ని కరువులు వుండగా, ఈ కొత్త కరువులు వచ్చి ముంచేస్తున్నాయి. :)
:)...