ఇరవయి ఒకటో శతాబ్దం లో వున్నామని గర్వపడనక్ఖరలేదు. శాస్త్ర సాంకేతికంగా అభివృద్ది చెందుతున్నామని చంకలు గుద్దుకో నక్ఖరలేదు. ప్రపంచీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని ఎవరికీ చెప్పుకో నక్ఖరలేదు.
ఎందుకంటే...
నా దేశం లో ఒక సగటు మహిళ, భారతీయ సంస్కృతికి ప్రతిరూపం, సంస్కారానికి మరో రూపం, నా సోదరి మణులు ఇంకా బిక్కు బిక్కు మంటూ దిక్కు తోచక దిగాలుగా సిగ్గుతో, ఒక చెంబేడు నీళ్ళతో బహిర్భూమికి వెలుతూనె వున్నారు. ఎంతటి దౌర్భాగ్యం? ఎంతటి అమానుషం?
అందరి అవహేలనలను తట్టుకుంటూ, మాన మర్యాదలను కాపాడుకుంటూ, పోకిరి రాయుళ్ళ చేష్టల నుంచి తప్పించుకుంటూ, తన మొఖాన్ని దాచుకుంటూ మనదేశం లో ఇరవయి శాతం మంది మహిళలు ఇలాంటి హీన పరిస్తితులలో బహిర్భూమికి వెళ్ళవలసిన దుస్తితి మన పాలకులకు పట్టదా? మన అధికారులకు మత్తు వదలదా? ఈ భయంకర పరిస్తితి నుంచి వారికి విముక్తి లేదా?
సిగ్గు పడుతున్నాను.... నాగరికంగా వెనకబడ్డ నా దేశాన్ని చూసి..
సిగ్గు పడుతున్నాను.... లేక్ఖల కే పరిమితమైన నా దేసాభివ్రుద్ధిని చూసి...
జాలి పడుతున్నాను.... అమాయకులైన నా ప్రజలను చూసి...
ఎదురుచూస్తున్నాను.... మహిళల కోసం మరో స్వతంత్ర పోరాటం కోసం...
(రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేశం లో ఎన్నో ప్రదేశాలలో ఎంతో మంది మహిళల దైన్య స్థితిని దర్పణం )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment