Thursday, 23 July 2009

పరిచయ వాక్యం

ప్రతిబింబాన్ని దర్శిస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయ మిత్రునికి స్వాగతం.

నా స్వంత బ్లాగ్ రాద్దామని చాల రోజులనుంచి ఒక చిన్న కోరిక, నా తోటి స్నేహితులు, స్నేహితురాళ్ళు బ్లాగ్స్ రాస్తుంటే, వారి అనుభవాలు వింటుంటే, బ్లాగ్స్ రాసాక వాళ్ల ఆనందం చూస్తుంటే, నాలో కూడా ఎక్కడో ఒక మూల చిగురించిన ఆశ, ఈ రోజు ఇలా తీరబోతున్నందుకు కించిత్ గర్వంగానూ, ఇంకొంచెం బిదియమ్గాను, మరి కొంచెం బాధ్యతగాను వుంది.

సరదాగా బ్లాగ్ రాసేకన్న, కొన్ని మంచి విషయాలు, నాలుగు మంచి మాటలు (ఒక వేళ చెప్పగలిగితే), నా అనుభవాలు మీ అందరితో పంచుకుంటే బాగుంటుంది అనిపించింది.
"ప్రతిబింబం" యొక్క ముఖ్య వుద్దేశం, ఒక సగటు మనిషిగా నాకు ఎదురైన అనుభవాలను, నాతొ పరిచయం వున్న, నేను చూస్తున్న మరియు గమనిస్తున్న వ్యక్తులను, మన నవ సమాజములో జరుగుతున్నా విషయాలను కొంచెం కొంటె తనం మరి కొంచెం హాస్య రసం జూడిన్చి మీ ముందు వుంచడమే....ఇందులో ప్రేమ, మమతానురాగాలు, మానవత విలువలు, ఆప్యాయతలు వుండొచ్చు, ఆనందాలు వుండొచ్చు, విషాదాలు వుండొచ్చు, అవమానాలు వుండొచ్చు, అవహేళనలు వుండొచ్చు, చతురోక్తులు వుండొచ్చు, సలహాలు వుండొచ్చు, విన్నపాలు కూడా వుండవొచ్చు సుమా...మరీ ముఖ్యముగా ఒక సగటు మనిషి ఆవేదన వుండొచ్చు, ఒక భారతీయుడి ఆవేశం వుండొచ్చు.

చెప్పడం మరిచిపోయనండోయి, మీ మనసుకు హాయినిచ్చే చిరు కవితలు కూడా వుండొచ్చు. అంటే నాకు కవిత్యం రాకపోయినా, ఏకలవ్యుడిలా ఏదో సొంతంగా రాయాలన్న తపనతో ప్రయోగాలు చేస్తుంటాను.
ఇంత సేపు మీ అమూల్యమైన సమయాన్ని నా బ్లాగ్ కోసం కేటాయించినందుకు చాల చాల థాంక్స్ అంది. ఇప్పుడు వాతావరణం చాల చల్లగా, ఆహ్లాదంగా వుంది. వెళ్లి ఒక మంచి ఫిల్టరు కాఫ్ఫీనో, వేడి వేడి మిరపకాయ బజ్జినో, కోడి కాని కోడి పకోడినో, ఇవి ఏమి కాకపోతే మన ఇంట్లో వాళ్ళని బ్రతిమిలాడి ఒక మంచి అల్లం టీనో లాగించండి మరి....

మల్లి కలుద్దాం...
ప్రతిబింబం...అందరికి...

3 comments:

  1. sharee.. oka blog owner.. :)

    All the best

    Karthik Pavan
    ( http://karthikpavang.blogspot.com )

    ReplyDelete
  2. All the best sir...


    meelo oo manchi(anukundam) kavi kuda unnadani telsindi :)

    ReplyDelete
  3. Good start Shareef! Btw, vaaram avutondi inkaa blog lo updates leventi? maaku maree roju kaakapoyinaa kaneesam vaaraniki oka post ayina lekapothe elaa??

    Come on..You can do it..I know you can do it..
    endukantae basically you are a good person..i know i know..

    anthae... (NNN lo venky style lo :-)

    Keep Going...

    Maa best wishes eppudu mee ventae..

    Itlu
    Mee sreyobhilaashi
    Katty

    ReplyDelete