Thursday, 27 August 2009

వానొచ్చింది...వానొచ్చింది...

వానొచ్చింది... వానొచ్చింది...
ఎండిన గొంతును తడపడానికి...
భూగర్భ జలాలను పెంచడానికి...
బెదిరిన రైతు గుండెకు భరోసా ఇవ్వడానికి...
కరెంటు కోతను తీర్చడానికి...
ధరలు నింగి నుంచి నేలకు దిగి రావడానికి...
బడిపిల్లలు మై మరచి నాట్యం చేయడానికి...

వానొచ్చింది...వానొచ్చింది...
ఎండిన చెరువులు నిండడానికి...
బోరు బావులను నీటితో నింపడానికి...
రిజర్వాయిర్లు తిరిగి జల కలలడడానికి...
నీటి ప్రాజెక్టుల పరవళ్ళను తనివి తీర చూడడానికి...
మన అమాత్యులకు ట్రాఫిక్ సమస్యలను తెలపడానికి...
అధికారుల మత్తు నిద్ర మేల్కొల్పడానికి...

వానొచ్చింది...వానొచ్చింది...
మన హైదరాబాద్ ప్రాణం మీదకొచ్చింది...

వానొచ్చింది....వానొచ్చింది...
హోర్డింగులు విరుచుకు పడడానికి...
భారి బానర్లు భయపెట్టడానికి..
మాన్ హొలులు మనల్ని మింగడానికి...
ట్రాఫిక్ సమస్యలు పెరగడానికి...
మంచి నీటి పైపులు కల్తీ అవ్వడానికి...
వాహనాలు నీటిలో తేలి ఆడడానికి...
మళ్లీ జీవితంతో మనం రాజీ పడడానికి...

వానొచ్చింది...వానొచ్చింది....
అందరినీ సంతోష సాగరాలలో ముంచెత్తడానికి...
కొందరి ప్రాణాలతో మాత్రం చెలగాటం ఆడడానికి...

(ఎన్నాళ్ళగానో మనం ఎదురు చూస్తున్న వాన రానే వచ్చింది...అందరికి సంతోషమే...అందరికి ఆమోదమే...అందరికి ఉపయోగమే...కాని మన హైదరాబాద్ పరిస్తితి మాత్రం అలానే వుండి. రెండు సెంటీ మీటర్ల వర్షానికే బిక్కు బిక్కు మంటుంది... ఎందరినో కబళిస్తుంది. మరి ఈ వర్షాలు ఇలాగె కొనసాగితే? వర్షాకాలములో తు తు మంత్రంగా చిన్నపాటి మరమ్మత్తులు తప్ప సాస్వత పరిష్కారం దిశగా ఎప్పుడు చర్యలు చేపదటారో ఆ వరుణ దేవుడికే తెలియాలి మరి.)

Monday, 10 August 2009

కరువు కోరల్లొ బ్రతుకు బరువు...

కరువు కరువు....ఎటు చుసిన కరువే...ఎం చేసిన కరువే...
స్వచ్చమైన నీటికి కరువే...గాలికి కరువే...
పేదవాడికి పట్టేడన్నానికి కరువే..
మధ్య తరగతి మందహాసానికి కరువే...
సంపన్నుడికి మనస్సాంతికి కరువే...

రుతుపవనాలలోను మేఘాలకు కరువే...నాట్లు వెయ్యాల్సిన రైతన్నకు నీళ్ళకు కరువే...
ఆడవారి భద్రతకు కరువే....నిజాయితీ గల నాయకులకు కరువే...

కాలుష్య రహిత వాతావరణానికి కరువే...సాఫ్ట్ వేర్ కొలువుల భద్రతకు కరువే...
పోషక విలువల పాలకు కరువే...పుట్టిన బిడ్డకు తల్లి ప్రేమ కరువే...
రసాయన రహిత పండ్లకు కరువే...నమ్మకమైన మనుషులకు కరువే...

కండి పప్పుకు కరువే....కూరగాయలకు కరువే...
స్వయన్ ఫ్లూ మందులకు కరువే...ఆసుపత్రులలో వార్డులకు కరువే...

చివరకు మనిషి భద్రతకు కరువే...దేశ భవిష్యత్తుకు కరువే...
కనీసం దేవుడికి నైవేద్యం పెట్టడానికి నెయ్యికి కరువే...
కరువు కోరల్లో మన అందరి బ్రతుకులు బరువే...

(దేశంలో ఎటు చుసిన వర్షాభావ పరిస్థితులతో, ధరలు ఆకాశానికి ఎగిరి, విద్య వుద్యోగ మరియు ఆహార భద్రత లేక విల విల లాడి అందరి బ్రతుకులు బరువై పోతున్నాయి...మళ్ళి మంచి రోజులు రావాలని....ప్రజలందరూ నిత్య సంతోషం తో వర్డ్చిల్లాలని కోరుకొంటూ....మీ అందరి ప్రతిబింబం)

Thursday, 6 August 2009

తదుపరి అంశం: నగర జీవితమా? లేక నరక జీవితమా?

యాంత్రిక నగర జీవితములో నమ్మకానికి చోటు లేక, నమ్మకం అమ్మకానికి సిద్ధంగా వున్నా వేళలో, మన ప్రస్తుత నగర జీవితం పై ప్రత్యేక కధనం.... త్వరలో...

సిగ్గు సిగ్గు...

ఇరవయి ఒకటో శతాబ్దం లో వున్నామని గర్వపడనక్ఖరలేదు. శాస్త్ర సాంకేతికంగా అభివృద్ది చెందుతున్నామని చంకలు గుద్దుకో నక్ఖరలేదు. ప్రపంచీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని ఎవరికీ చెప్పుకో నక్ఖరలేదు.

ఎందుకంటే...

నా దేశం లో ఒక సగటు మహిళ, భారతీయ సంస్కృతికి ప్రతిరూపం, సంస్కారానికి మరో రూపం, నా సోదరి మణులు ఇంకా బిక్కు బిక్కు మంటూ దిక్కు తోచక దిగాలుగా సిగ్గుతో, ఒక చెంబేడు నీళ్ళతో బహిర్భూమికి వెలుతూనె వున్నారు. ఎంతటి దౌర్భాగ్యం? ఎంతటి అమానుషం?

అందరి అవహేలనలను తట్టుకుంటూ, మాన మర్యాదలను కాపాడుకుంటూ, పోకిరి రాయుళ్ళ చేష్టల నుంచి తప్పించుకుంటూ, తన మొఖాన్ని దాచుకుంటూ మనదేశం లో ఇరవయి శాతం మంది మహిళలు ఇలాంటి హీన పరిస్తితులలో బహిర్భూమికి వెళ్ళవలసిన దుస్తితి మన పాలకులకు పట్టదా? మన అధికారులకు మత్తు వదలదా? ఈ భయంకర పరిస్తితి నుంచి వారికి విముక్తి లేదా?

సిగ్గు పడుతున్నాను.... నాగరికంగా వెనకబడ్డ నా దేశాన్ని చూసి..
సిగ్గు పడుతున్నాను.... లేక్ఖల కే పరిమితమైన నా దేసాభివ్రుద్ధిని చూసి...
జాలి పడుతున్నాను.... అమాయకులైన నా ప్రజలను చూసి...
ఎదురుచూస్తున్నాను.... మహిళల కోసం మరో స్వతంత్ర పోరాటం కోసం...

(రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేశం లో ఎన్నో ప్రదేశాలలో ఎంతో మంది మహిళల దైన్య స్థితిని దర్పణం )